గెలికావ్.. ఇక చూసుకొందాం.. !

గెలికావ్ జగన్.. ఇక చూసుకొందాం అంటున్నారు జనసేన కార్యకర్తలు. మంగళవారం సామర్లకోటలో మీడియాతో మాట్లాడిన జగన్ పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ ని పర్సనల్ గా టార్గెట్ చేశారు. ‘కొత్తకారు మార్చినంత ఈజీగా పెళ్ళాలను మారుస్తాడు పవన్. ఇప్పటికి నలుగురిని మార్చాడు. ఆయన నైతికత… నిజాయితీ గుంచి మాట్లాడతాడు. చంద్రబాబును కాపాడాలనుకునే ప్రతి సారీ బైటకు వచ్చి ఒక ట్వీటో…ఒక ప్రెస్ మీటో పెడతాడు. మళ్ళీ ఎక్కడికి పోతాడో తెలియదు. మన ఖర్మ కొద్దీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తోంది. నాలుగేళ్ళు టిడిపి-బిజెపితో కలిసి కాపురం చేసి ఏపి ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తి పవన్. ఆయన గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు అంతే సీరియస్ గా తీసుకొన్నారు. జగన్ రొమాంటిక్ యాంగిల్ ని బయటికి తీసే పనిలో ఉన్నారు.

పర్సనల్ విషయాలని గెలికావ్ జగన్.. ఇక చూసుకొందామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే బెంగళూరులో ఫాం హౌస్ లో జగన్ రాసలీలని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ అమ్మాయితో జగన్ సన్నిహితంగా దిగిన ఫోటోని షోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జగన్.. ఈ అమ్మాయి ఎవరు ? బెంగళూరు ఫాం హౌస్ లో నీవు వెలగబెట్టేది ఇదే కదా.. ! అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అవును.. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకొన్నారు. అన్నీ న్యాయపరంగా చేసుకొన్నారు. వారికి విడాకులు ఇచ్చిన తర్వాతే మరో పెళ్లి చేసుకొన్నారని బదులిచ్చారు. ఇదీగాక, జగన్ రొమాంటిక్ యాంగిల్ ని తవ్వి తీసి.. ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేసే పనిలో జనసేన కార్యకర్తలు ఉన్నట్టు సమాచారమ్.