సూపర్ స్టార్’ని వ్యతిరేకించిన ప్రకాష్ రాజ్
లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ జైలుకెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఆయన్ని అమ్మ (మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్) నుంచి బహిష్కరించారు. ఐతే, ఇటీవలే ఆ నిషేధాన్ని ఎత్తేశారు కూడా. ఈ నిర్ణయంపై ‘అమ్మ’ అధ్యక్షుడు మోహన్ లాల్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దిలీప్ కు తిరిగి సభ్యత్వం కల్పించే విషయంలో మోహన్ లాల్ తమను సంప్రదించలేదని అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో కేరళ ప్రభుత్వం నిర్వహించనున్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మోహన్ లాల్ ను ఆహ్వానించొద్దు అనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఈ మేరకు జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు బిజూకుమార్ దామోదరన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. వందకు పైగా నటులు తమ మద్దతు తెలిపారని ఈ లేఖ తెలిపారు. వారిలో నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నట్టు చెప్పారు. దీనిపై ప్రకాశ్ రాజ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోహన్ లాల్ ను వ్యతిరేకిస్తూ తాను ఎటువంటి మద్దతు తెలుపలేదు. సంతకాలు చేయలేదని స్పష్టం చేశారు. నటుడు దిలీప్ విషయంలో ‘అమ్మ’ తీసుకున్న నిర్ణయంపై తనకు విభేదాలు ఉన్నాయి. కానీ, మోహన్ లాల్ కు వ్యతిరేకంగా రాసిన లేఖపై మాత్రం తాను సంతకం చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
Clarifying… against s a wrong news doing the rounds pic.twitter.com/PIcyua2GA2
— Prakash Raj (@prakashraaj) July 24, 2018