రాజాసింగ్.. హైదరాబాద్ మే సవాల్ !

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హైదరాబాద్ మే సవాల్ అంటున్నారు. ఆయన పార్టీలో రెబల్ లీడర్’గా పేరు తెచ్చుకొన్నాడు. ప్రస్తుతం రాజాసింగ్ గోషామహల్ నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఐతే, వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.. ఈ రెబల్ లీడర్. హైదరాబాద్ ఎంపీ స్థానం ఎంఐఎం కు కంచుకోట అన్న సంగతి తెలిసిందే. గత 30యేళ్లుగా అక్కడ ఆ పార్టీ జెండానే ఎగురుతోంది. హైదరాబాద్ లో ఎంఐఎంని ఎదుర్కోడానికి బీజేపీ నేతలు బద్దం బాల్ రెడ్డి, ఆలే నరేంద్ర లాంటి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

2014 లో హైదరాబాద్ నుంచి ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీ భారీ మెజారిటీతో గెలుపొందారు. దాదాపు 2లక్షల పై చిలుకు మెజారిటీతో అసరుద్దీన్ విజయం సాధించారు. బీజేపీ రెండో స్థానానికి పరితమైంది. ఐతే, ఈసారి ఎంఐఎంని దెబ్బకొట్టాలనే కసితో రాజా సింగ్ ఉన్నారు. హైదరాబాద్ లో ఎంఐఎంపై వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పుడా వ్యతిరేకతని బలంగా మార్చుకొని హైదరాబాద్ స్థానాన్ని బీజేపీ వశం చేసుకోవాలని అనుకొంటున్నారు.. ఈ బీజేపీ ఎమ్మెల్యే. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ముందు కూడా ఈ ప్రపొజల్ ని పెట్టినట్టు సమాచారమ్.

రాష్ట్ర బీజేపీ నేతలకు ఎమ్మెల్యే రాజా సింగ్ కు సఖ్యత లేదు. తన నియోజకవర్గ సమస్యలని రాష్ట్ర పార్టీకి దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి ఫలితం లేదని ఆయన బాహాటంగా చెప్పారు. రాష్ట్ర పార్టీ వ్యవహారంపై రాజాసింగ్ పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఇవీగాక, రాజాసింగ్ చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజాసింగ్ హైదరాబాద్ నుంచి బరిలోకి దిగేందుకు భాజాపా అధిష్టానం ఒప్పుకుంటుందా.. ? ఒకవేళ అధిష్టానం రాజాసింగ్ ఓకే చెప్పినా.. స్థానికంగా భాజాపా నేతలు ఆయనకు ఏ మేరకు సహకరిస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. మొత్తానికి.. రాజా సింగ్ హైదరాబాద్ మే సవాల్ ? చేయడం ఆకట్టుకుంటోంది.