వియ్యంకుల్లో విజేత ఎవరు ?
గుంటూరు జిల్లా రాజకీయాల్లో వియ్యంకులదే హవా. వినుకొండ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్ వరుసకి వియ్యంకులు. ఆంజనేయులు కుమార్తెను శ్రీధర్ కు కొడుక్కి ఇచ్చి వివాహం చేశారు. వియ్యంకులిద్దరు కూడా వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చే (2019) ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపుతో మంత్రులు అయిపోవాలని ఆశపడుతున్నారు. ఎమ్మెల్యే ఆంజనేయులు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఇక, శ్రీదర్ కు లోకేష్ తో మంచి సాన్నిహిత్యం ఉందని చెబుతున్నారు.
ఏపీ బీజీపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పెదకూరుపాడుపై ఫోకస్ చేసినట్టు కనబడుతోంది. ఇక, వైసీపీ నుంచి బొల్ల బ్రాహ్మానాయుడు పోటీకి దిగనున్నారు. ఇతడు ఇప్పటికే వియ్యంకుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ సారి వారిపై గెలుపొంది లెక్కసరి చేయాలనే కసితో ఉన్నాడు. పెదకూరపాడు టైట్ గా మారితే.. అక్కడి నుంచి గుంటూరు పశ్చిమకు షిఫ్ట్ అయ్యేందుకు శ్రీధర్ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. కాలం కలిసొచ్చి.. వియ్యంకులిద్దరు గెలిస్తే వీరిలో మంత్రి అయ్యేది ఎవరు ? అన్నది కూడా ఆసక్తిగా మారింది. ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పటికైతే వియ్యంకులు హాట్రిక్ విజయం సాధించడంపైనే దృష్టి సారించినట్టు చెబుతున్నారు.