జగన్ పై పవన్ నెగ్గాడు
‘ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు’ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. ఇప్పుడీ లైన్ ని తూ.చ తప్పకుండా పాటించారు పవన్. జగన్ పై తగ్గి.. నెగ్గారు. పవన్ వ్యక్తిగత జీవితంపై జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పవన్‌కు విలువలు ఎక్కడున్నాయి ? ఆయనకు నలుగురు.. నలుగురు భార్యలు అన్నారు. కొత్త కారు మార్చినట్టు భార్యల్ని మారుస్తాడని ఆరోపించారు. పవన్ రాజకీయాలపై మాట్లాడటం, వినడం మన ఖర్మ అన్నారు. విలువలు లేని పవన్ మాట్లాడితే సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు.
తన వ్యక్తిగత జీవితంపై జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ హుందాగా వ్యవహరించారు. తాను బలమైన వ్యక్తిని కాబట్టే జగన్ తనపై వ్యక్తిగత విమర్శలు చేశారు. మార్పుకోసం ప్రయత్నిస్తున్నాననే కోపంతో జగన్, బీజేపీ నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు పవన్. పవన్ అభిమానులు, జనసేన శ్రేణులు జగన్ ని కూడా పర్సనల్ గా టార్గెట్ చేద్దామని ప్లాన్ చేశారు. ఐతే, వారిని పవన్ వారించారు. వ్యక్తిగత దూషణలకు వెళ్లొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు.
తాజాగా, ఈ విషయంపై పవన్ ట్విట్ చేశారు. ‘ఈ మధ్యన శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన తీరు చాలా మందికి బాధ కలిగించిందని నా దృష్టికి వచ్చింది. నేను ఎవరి వ్యక్తిగతమైన జీవితాల్లోకి వెళ్లను, అది రాజకీయ లబ్ధి కోసం అసలు వాడను, ప్రజలకు సంబందించిన పబ్లిక్ పాలసీల మీదే మిగతా పార్టీలతో విభేదిస్తాను కానీ, ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవు. ఈ తరుణంలో ఎవరన్నా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వారికి సంబంధించిన కుటుంబసభ్యులను కానీ వారి ఇంటి ఆడపచులని ఈ వివాదంలోకి లాగవద్దని మనస్ఫూర్తిగా అందిరినీ వేడుకుంటున్నా. ఈ వివాదాన్ని దయచేసి అందరూ ఇక్కడితే ఆపివేయాల్సిందిగా నా ప్రార్థన’’అని ట్వీట్ చేశారు పవన్.
పవన్ చాలా బాధ్యతగా వ్యవహరించడంతో జగన్ ఇరుకునన పడినట్లు అయింది. తాను పవన్ విషయంలో తప్పు చేశానని జగన్ కు అర్థమయింది. అందుకే పవన్ పై చేసిన ఆరోపణలకి ఆయన సాక్షి పేపర్, టీవీ పెద్ద ప్రాధాన్యతని ఇవ్వలేదు. దీనికితోడు.. పవన్ చేసింది తప్పు అంటూ ఉండవల్లి లాంటి వాళ్లు బహిరంగంగానే చెప్పారు. మొత్తానికి.. ఈ ఏపీసోడ్ లో జగన్ పై పవన్ తగ్గి.. నెగ్గాడని చెప్పవచ్చు.