‘ఎన్టీఆర్’లో.. హెచ్‌.ఎం.రెడ్డిగా కైకాల !

క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బుధవారంతో తొలి షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. ‘ఎన్టీఆర్‌’లో… దక్షిణ భారత సినీ పితామహుడిగా పేరుగాంచిన హెచ్‌.ఎం.రెడ్డిగా ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ నటిస్తున్నారు. బుధవారం కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ‘ఎన్టీఆర్‌’లోని ఆయన లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘ఆ మహానుభావుడి పాత్రను ఈ మహానటుడు అమోఘమైన పద్ధతిలో రంజింపజేశారని’ దర్శకుడు క్రిష్ తెలిపారు. ‘కాళిదాసు’, ‘భక్త ప్రహ్లాద’ చిత్రాలతో దక్షిణ భారతీయ సినిమాకి పునాది వేసిన దర్శకుడు హెచ్‌.ఎం.రెడ్డి. తెలుగు, తమిళం భాషల్లో ఆయన తీసిన ‘కాళిదాసు’ దక్షిణ భారత తొలి టాకీ చిత్రం కావడం విశేషం.

ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ గా ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఆయన భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపిస్తారు. ఇప్పటికే ఆమె షూటింగ్ లో జాయిన్ అయ్యింది. టాలీవుడ్ స్టార్స్ మోహన్ బాబు, మహేష్ బాబు, నాగ చైతన్య, రానా దగ్గుపాటి, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్, అనసూయ.. తదితరులు ఎన్ టీఆర్ జీవిత కథలో కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ‘ఎన్టీఆర్’ని జెడ్ స్వీడుతో పూర్తి చేసే పనిలో దర్శకుడు క్రిష్ ఉన్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఐతే, నవంబర్ లోనే సినిమా షూటింగ్ ని పూర్తి చేసేలా క్రిష్ ప్లాన్ చేసుకొన్నట్టు సమాచారమ్.