మగ్గం పట్టిన అనసూయ

మైక్ పట్టి యాంకర్ గా తన మాటలతో మంత్రముగ్దుల్ని చేస్తూ ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేయడంలో అనసూయ దిట్ట. అయితే యిప్పుడు ఆమె మైక్ వదిలేసి సరదాగా కాసేపు మగ్గం పట్టి ఓ స్టిల్ ఇచ్చారు. మగ్గం నేస్తూ నవ్వులు చిందిస్తూ ఫొటోకు పొజిచ్చారు. అయితే ఇదేదో సినిమా కోసమో, మరేదైనా యాడ్ కోసమో మాత్రం కాదండి.

యాదాద్రిభువనగిరి జిల్లాలోని పోచంపల్లిలో ఆమె సరదాగా షాపింగ్ చేశారు. చేనేతకు పేరున్న అక్కడ చీరలు నేయడం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసారమే. అక్కడి నేతన్నలను ఆప్యాయంగా పలకరించారు. వారి కృషిని ప్రశంసిస్తూ సన్మానించారు.

సోగ్గాడే చిన్నినాయన’తో వెండితెరకు పరిచయమైంది అనసూయ. ‘క్షణం’ సినిమా అనసూయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ యేడాది ‘రంగస్థలం’తో బ్లాక్ బస్టర్ హిట్ రుచి చూసింది. రంగమ్మత్తగా అనసూయ అదరగొట్టింది. ఇప్పుడు ఈ హాట్ యాంకర్ కోసం దర్శకులు ప్రత్యేక పాత్రలు రెడీ చేస్తున్నారు.