బీబీనగర్ లోనే ఎయిమ్స్…!
ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే కేంద్రం స్థల పరిశీలన చేసిన విషయం తెలిసిందే. యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ నిమ్స్ పరిసరాల్లో ఎయిమ్స్ ఏర్పాటుకు అధికారులు స్థలాన్ని పరిశీలించారు. తాజాగా తెలంగానలో ఎయిమ్స్ ఏర్పాటుకు అవసరమైన బీబీనగర్ స్థలాన్ని అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
బీబీ నగర్‌లోని స్థలాన్ని తమకు అప్పగించాలని లేఖలో పేర్కొంది. అలాగే పక్కనే ఉన్న 49 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించి తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. రోడ్లు, విద్యత్తు వంటి పలు సదుపాయాలు కల్పించాలని కేంద్ర పీఎం ఎస్ ఎస్ వై డైరెక్టర్ సంజయ్ రాయ్.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి కి లేఖ పంపారు.
కొద్ది రోజుల క్రితమే బీబీ నగర్ స్థలాన్ని పరిశీలించి వెళ్లింది కేంద్ర బృందం.
ఎయిమ్స్ రావడానికి విశేష కృషి చేసిన సీఎం కేసీఆర్, ఎంపిలు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. ప్రధాన మంత్రి, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రులకు కృతజ్ఞతలు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.