అందుకే.. షర్ట్ లేకుండా విజయ్ దేవరకొండ ఎంట్రీ.. !

యంగ్ హీరో విజయ్ దేవరకొండలో ఏదో.. పవర్ ఉంది. యూత్ ని ఆకట్టుకొనే పవర్ ఉంది. అందుకే ఆయన్ని జూనియర్ పవర్ స్టార్. తెలంగాణ పవర్ స్టార్ గా పిలుచుకొంటున్నారు. పవన్ కళ్యాణ్ మాదిరిగానే విజయ్ కూడా యూత్ ని ఆకట్టుకొనే సినిమాలు చేస్తున్నాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలతో విజయ్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ తాజా చిత్రం ‘గీత గోవిందం’. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ బిగ్‌ బాస్‌ హౌస్’లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. సాదాసీదాగా రావడం లేదు. ష‌ర్ట్ లేకుండా షోలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు ఈ యంగ్ హీరో. విజయ్ దేవరకొండ షర్ట్ లేకుండా బిగ్ బాస్ హౌస్’లోకి ఎంట్రీ ఇవ్వడం ఓ కారణం ఉంది. విజయ్ తన స్నేహితుల కలిసి ‘రౌడీ బ్రాండ్’ దుస్తులని తీసుకొచ్చాడు. వాటిని కూడా బిగ్ బాస్ లో ప్రమోట్ చేసే పనిలో భాగంగా షర్ట్ లేకుండా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారమ్. ఇటీవలే విజయ్ చేతుల మీదగా ‘రౌడీ బ్రాండ్’ విడుదలైన సంగతి తెలిసిందే.