బ్యాటింగ్ కోచ్‌గా సెహ్వాగ్ !
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్. సెహ్వాన్ విజృంభిస్తే వార్ వన్ సైడ్ నే. అలాంటి వన్ సైడ్ వార్ ని ఎన్నో చూశాం. ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరించబోతున్నాడు. అలాగని స్వీహాగ్ టీమిండియాకు కోచ్ కాదు. మరాఠ అరేబియన్స్ జట్టుకు సెహ్వాగ్ బ్యాటింగ్ కోచ్ గా నియమింపబడ్డారు. గత ఏడాది యూఏఈలో టీ10 క్రికెట్ లీగ్ నిర్వహించారు. ఈ లీగ్‌లో మరాఠ అరేబియన్స్ జట్టుకు సెహ్వాగ్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ లీగ్ రెండో సీజన్ నవంబరులో జరగనుంది.
ఐతే, రెండో సీజన్‌లో సెహ్వాగ్ ఆడట్లేదు. సెహ్వాగ్ సేవలను ఎలాగైనా జట్టుకు అందించాలన్న యోచనతో మరాఠ అరేబియన్స్ యాజమాన్యం అతడికి బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది. ‘గత ఏడాది జట్టును నడిపించిన సెహ్వాగ్ ఇప్పుడు అదే జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే అతడితో ఒప్పందం చేసుకున్నాం’ అని మరాఠ అరేబియన్స్ సహ యజమాని పర్వేజ్ ఖాన్ తెలిపారు. ఇక, క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం సెహ్వాగ్ ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.