‘హ్యాపీ వెడ్డింగ్’ పబ్లిక్ టాక్


థియేటర్స్ లో మెగా హీరోయిన్ నిహారిక పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లిని చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. అదేనండీ.. ! నిహారిక – సుమంత్ అశ్విన్ లు జంటగా నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఉదయం షోలు పడిపోయాయి. పబ్లిక్ టాక్ బయటికొచ్చింది. నిహారిక వెడ్డింగ్ కాస్త నెమ్మదిగా జరిగినా చాలా బాగా జరిగిందని చెప్పుకొంటున్నారు. నిహారిక-సుమంత్ ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవాలని ఫిక్సయిపోవడం. దానికి పెద్దలు అంగీకరించడం కూడా జరిగింది. ఐతే, పెళ్లికి ముందు గల కన్ఫూజన్ నుంచి నిహారిక ఎలా బయటపడింది ? అనే పాయింట్ తో సినిమా సాగింది.

సినిమాలో నీహారిక చాలా ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న అమ్మాయి పాత్రలో కనిపించింది. ఎమోషనల్ సీన్స్ లోనూ ఆకట్టుకొంది. పెళ్లికి రెడీ అయిన జంటకు ఊహించిన విధంగా సమస్యకు ఎదురవ్వడం, దాంతో ఇంటర్వెల్ పాయింట్ చాలా ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు. నేటి యువతకు సంబంధించిన సమకాలీన మరియు ఆధునిక సంబంధాల ఆధారంగా సినిమా తెరకెక్కించారు. నరేష్, మురళి శర్మ, ఇంద్రజ పాత్రలని బాగా రాసుకొన్నాడు. క్లైమాస్ లో సీరియస్ మూడ్ లో కథని నడిపి.. హ్యాపీ ఎండింగ్ తో ముంచాడు. కథ కాస్త స్లోగా నటించిందని చెబుతున్నారు. మొత్తానికి.. ‘హాపీ వెడ్డింగ్’ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.