మహేష్ కాలేజీలో కనిపించాడోచ్.. !!

సూపర్ స్టార్ మహేష్ బాబు కాలేజీలో కనిపించాడు. స్నేహితుడితో కలిసి సరదాగా నవ్వుకుంటూ వెళ్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక్కడ మహేష్ స్నేహితుడు ఎవరో తెలుసా ? దర్శకుడు వంశీపైడిపల్లి. శుక్రవారం వంశీపైడిపల్లి పుట్టినరోజు సందర్భంగా మహేష్ పోస్ట్ చేసిన పిక్ ఇది. “40 ఏళ్ల యంగ్‌ దర్శకుడు, నా స్నేహితుడు వంశీ పైడిపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అనుమానం లేదు.. 40 ఏళ్లంటే 20 ఏళ్లే. యంగ్‌గా, ఆనందంగా జీవించండి” అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు.

ఐతే, మహేష్ పోస్ట్ చేసిన పిక్ ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. మహేష్ 25వ సినిమాకు సంబంధించి డ్రెహాడూన్ షెడ్యూల్ లో తీసిన పిక్ అది. ఆ షెడ్యూల్ లో మహేష్ పై కాలేజీ నేపథ్యంలో వచ్చిని సన్నివేశాలని చిత్రీకరించారు. ఇప్పుడీ పిక్ ని చూస్తే.. కాలేజీ లో మహేష్ ఎలా కనిపించబోతున్నాడు అన్నది అర్థమైపోతుంది. మీసం కట్టుతో కాలేజీ కుర్రాడి లుక్ లో మహేష్ సూపర్ గా ఉన్నాడు. కాలేజీ ఏపీసోడ్ లో మహేష్ సరదాగా కనిపిస్తాడట. ఆయన వెంట కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఉండబోతున్నాడు. ఇక, సరదాలకు కొదవుండదేమో.. !

ఈ చిత్రంలో మహేష్ మూడు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. కాలేజీ స్టూడెంట్ గా, ఓ యుఎస్ కంపెనీ సీఈవో గా, రైతుగానూ మహేష్ కనిపిస్తాడట. ఆమీర్ ఖాన్ త్రి ఇడియట్స్ తరహా సరదాగా సాగుతూనే, ఎమోషన్స్ పండించే కథ ఇదని చెబుతున్నారు. ఈ చిత్రంలో మహేష్ పూజా హెగ్డే జతకట్టనుంది. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ గోవాలో జరగనుంది.