డ్రంకెన్ డ్రైవ్‌లో బుక్కైన ‘రంగస్థలం’ సింగర్ !
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. ఆ సమయంలో రాహుల్ మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ వైపు వెళ్తున్నారు. ఆయనకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా 178 పాయింట్లు వచ్చాయి. కేసు బుక్ చేసిన పోలీసులు కారును సీజ్ చేశారు. కారులో రాహుల్‌తోపాటు యాంకర్, నటుడు లోబో కూడా ఉన్నాడు. తాగిన మైకంలో ఉన్న రాహుల్ పోలీసులకు సహకరించకుండా వారితో వాగ్వాదానికి దిగాడు. రాహుల్ సిప్లిగంజ్ లైసెన్స్ లేకుండానే కారు నడిపినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది.
ఈ యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన రామ్ చరణ్ ‘రంగస్థలం’లో టైటిల్ సాంగ్ పాడింది రాహుల్ నే. పూర్ గర్ల్, మంగమ్మ, మాక్కికిరికిరీ, గల్లీకా గణేష్ వంటి ప్రైవేట్ ఆల్బమ్స్ రాహుల్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక, ఇటీవల కాలంలో సెలబ్రేటీలు డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడటం ఎక్కువగా చూస్తున్నాం. యాంకర్ ప్రదీప్, మచ్చ రవి, దర్శకుడు బాబీ… పోలీసులకు చిక్కారు. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన సెలబ్రేటీలు ఇలా తాగి డ్రైవింగ్ చేయడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.