రేణు దర్శకత్వంలో పవన్ సినిమా.. !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలుగు తెరపై రీ-ఎంట్రీ ఇవ్వనుంది. వరుసగా తెలుగు సినిమాల్లో నటించేందుకు ప్లాన్ చేసుకొంటోంది అనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా, దీనిపై రేణు స్పందించింది. తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్నది నిజమే. ఐతే, నటిగా కాదు.. దర్శకురాలిగానని తెలిపింది. ఆల్రెడీ కథ-స్క్రీన్ ప్లే సిద్ధమైపోయింది. ప్రస్తుతం డైలాగ్స్ రాస్తున్నా. సంక్రాంతి నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పింది. ఐతే, తన సినిమాలో హీరో ఎవరన్నది మాత్రం చెప్పలేదు రేణు. బహుశా.. పవన్ కళ్యాణ్ తో రేణు సినిమా ఉండబోతుందేమోనని కొందరు సటైర్స్ వేస్తున్నారు.

ఇక, పవన్ తో విడిపోయిన తర్వాత రేణు పూణేలో ఉంటుంది. మరాఠీ చిత్రపరిశ్రమపై దృష్టిపెట్టింది. దర్శక నిర్మాతగా వ్యవహరిస్తోంది. త్వరలోనే రేణు రెండో పెళ్లిచేసుకోబోతుంది. ఇప్పటికే ఆమె నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. రేణు పెళ్లిని చాలా సింపుల్ గా ప్లాన్ చేసినట్టు తెలిసింది. కోయంబత్తూరులోని లింగ భైరవి ఆలయంలో పెళ్లి జరగనుంది. ఈ వేడుకకి కేవలం కుటుంబ సభ్యుల మాత్రమే హాజరుకానున్నారు. రేణును తాను చేసుకోబోయే వ్యక్తి వివరాలని సీక్రెట్ ఉంచుతోంది. పెళ్లి తర్వాతే ఆయన గురించి చెబుతానంటోంది.