బన్నీకి మసాల కావాలట !

ఓకే చెప్పిన విక్రమ్ కె కుమార్ సినిమాని బన్నీ పక్కన పెట్టేశాడనే ప్రచారం జరిగింది. దీంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ‘కొద్దిరోజులు ఓపిక పెట్టండి. ఈ సారి మంచి సినిమాతో ముందుకొస్తా’నని అభిమానులని రిక్వెస్ట్ చేశాడు బన్నీ. ఐతే, విక్రమ్ కుమార్ రెడీ చేసిన కథ బన్నీకి నచ్చకపోవడమే ఈ ఆలస్యానికి కారణమని తెలిసింది. దీంతో విక్రమ్ కుమార్ బన్నీ కోసం మరో కథని రెడీ చేసే పనిలో ఉన్నాడట. తనకు మసాల కథ కావాలని బన్నీ కోరినట్టు చెబుతున్నారు. ఆయన కోరిక మేరకు తన కథకు మసాల అద్దే పనిలో విక్రమ్ ఉన్నట్టు తెలుస్తోంది.

‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ కోసం చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఈ లిస్టులో కొరటాల శివ, త్రివిక్రమ్ పేర్లు కూడా వినిపించాయి. ఈ ఇద్దరు దర్శకులు ఇతర ప్రాజెక్టులతొ బిజీ అయిపోవడం జరిగింది. ఇతర దర్శకులు చెప్పిన కథల్లో విక్రమ్ చెప్పిన లైన్ బన్నీకి బాగా నచ్చేసింది. ఐతే, పూర్తి కథతో విక్రమ్ బన్నీని మెప్పించకపోవడంతో మరింత ఆలస్యమవుతోంది. ఇష్క్, మనం, 24 లాంటి సూపర్ హిట్ చిత్రాలు తీసిన విక్రమ్ కుమార్ బన్నీతో ఓ మాస్-యాక్షన్ ఎంటర్ టైనర్ తీసేందుకు రెడీ అవుతున్నారు.