మళ్లీ అమెరికాకు ‘అఅఆ’ !

శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ ‘అఅఆ’ (అమర్ అక్భర్ ఆంథోనీ) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే తొలి షెడ్యూల్ అమెరికాలో పూర్తి చేసుకొంది. రెండో షెడ్యూల్ ని కూడా అమెరికాలోనే ప్లాన్ చేశారు. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 17 వరకు రెండో షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్ యాక్షన్ ఏపీసోడ్స్ తో పాటు, పాటలని కూడా చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాతో ఇలియానా టాలీవుడ్ కు రీ-ఎంట్రీ ఇవ్వనుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తాడా.. ? లేదంటే మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాడా.. ?? అనేది ఆసక్తిగా మారింది. ఇందులో సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న శ్రీనువైట్ల, రవితేజలు ఈ సినిమా చాలా కీలకంగా భావిస్తున్నారు.