వీర భోగ వసంత రాయలు : శ్రీవిష్ణు ఫస్ట్ లుక్


టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల హవా మొదలైంది. ప్రస్తుతం మూడ్నాలుగు మల్టీస్టారర్ సినిమాలు సెట్స్ మీదున్నాయి. ఈ మల్టీస్టారర్ ట్రెండుకు ప్రాధాన్యత తీసుకొచ్చిన క్రిడిట్ మాత్రం విక్టరీ వెంకటేష్ దే. ఆయన స్టార్ హీరోలు, యంగ్ హీరోలతోనూ తెరను పంచుకునేందుకు రెడీగా ఉంటారు. పవన్, మహేష్, రామ్, శ్రీకాంత్.. తదితరులతో కలిసి వెంకీ నటించారు. ప్రస్తుతం రెండు మల్టీస్టారర్ సినిమాలతో వెంకీ బిజీగా ఉన్నారు. మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 2’లో నటిస్తున్నారు వెంకీ. ‘ఎఫ్ 2’ అనిల్ రాఘవపూడి దర్శకుడు. మెహ్రీన్, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నాగ చైతన్య – వెంకీల మల్టీస్టారర్ గా ‘వెంకీ మామ’ తెరకెక్కుతోంది. బాబీ దర్శకుడు.

ఇక, నాగ్-నాల మల్టీస్టారర్ గా ‘దేవదాస్’ తెరకెక్కుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఇందులో నాగ్ డాన్ పాత్రలో, నాని డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. డాన్, డాక్టర్ లింకు ఎలా కుదిరింది ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. యంగ్ హీరోలు నారా రోహిత్, సుధీర్‌ బాబు, శ్రీవిష్ణు మల్టీస్టారర్ గా ‘వీర భోగ వసంత రాయలు’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఇందసేన దర్శకుడు. శ్రియ కీలక పాత్రలో కనిపించనుంది. ఢిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇటీవలే ఈ సినిమా నుంచి నారా రోహిత్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం.

తాజాగా, శ్రీవిష్ణు లుక్ ని చిత్రబృందం విడుదల చేసింది. డిఫరెంట్ లుక్ లో శ్రీవిష్ణు కనిపిస్తున్నాడు. తెల్లని గుర్రంతో ఉన్న శ్రీవిష్ణు పోస్టర్ ని వదిలారు. ఇందులో శ్రీ విష్ణు గ్రహాంతర వాసిగా కనిపించబోతున్నాడు. ఆమీర్ ఖాన్ ‘పీకే’ తరహాలో ఆయన పాత్ర ఉండనుందని ప్రచారం జరిగింది. ఐతే, ఫస్ట్ లుక్ లో అలాంటిదేమీ చూపించలేదు. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు.