ఎన్టీఆర్ సినిమా.. మరో లీక్ !

తారక్ – త్రివిక్రమ్’ల ‘అరవింద సమేత’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే, ఈ సినిమాకి లీకులు గోల పట్టుకుంది.ఇప్పటికే ఎన్టీఆర్- నాగబాబుకు సంబంధించి ఓ ఎమోషనల్ సీక్వెన్స్ లోని ఫోటో లీకయింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లీకుపై త్రివిక్రమ్ సీరియస్ అయ్యాడు. సెట్స్ లోకి సెల్ ఫోన్స్ తీసుకురావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అయినా.. లీకులు మాత్రం ఆగడం లేదు.

తాజాగా ‘అరవింద సమేత’ షూట్ లొకేషన్ నుండి మరో పిక్ లీకైంది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ వీరరాఘవ అవతారంలో ఉన్న సీమ యువకుడి గెటప్ ఉన్నాడు. పైన తెలుపు రంగు ఖద్దరు టైపు కుర్తా.. కిందేమో బ్లూ కలర్ జీన్స్ వేసుకొని ఎన్టీఆర్ నడుస్తూ ఉన్నాడు . బుర్రమీసాలు లాంటివి లేకున్నా గెటప్ మాత్రం అదిరిపోయిందంతే. ఈ ఫోటో ఇప్పటికే సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఈ లీకులు ఇలాగే కొనసాగితే.. భారీ మూల్యం చెల్లించక తప్పదు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత ‘అరవింద సమేత’ చిత్రబృందం పొల్లచ్చి వెళ్లనుందని తెలిసింది.