రాహుల్ కు క్లారిటీ ఇచ్చిన చిరు…!!
ఏపీలో రాజకీయంగా పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం చేరికలను కూడా ప్రోత్సహిస్తోంది. ప్రత్యేక హోదా పేరుతో రాజకీయంగా కీలక పరిణామాలు జరుగుతున్న క్రమంలో పార్టీలు, పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు కురిపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మెగాస్టార్ చిరు మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు. తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన చిరు సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.
చిరు సోదరుడు జనసేన అధినేత పవన్ రాష్ట్రంలో అధికార పార్టీపై విమర్శలు కురిపిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. చిరు అభిమాన సంఘాల నేతలు, అభిమానులు సైతం తాజాగా జనసేనలో చేరిపోయారు కూడా. అయినప్పటికే ఈ అంశంపై కూడా చిరు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో చిరు కూడా జనసేనకు మద్దతు తెలుపుతారా అనే డైలామా రాజకీయ వర్గాల్లో నెలకొంది. అయితే తాజగా ఏపీపీసీసీ చీప్ రఘువీరా రెడ్డి ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.
చిరు ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారని, రాజకీయంగా ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా ఎన్నికల్లో కాంగ్రెస్ సపోర్ట్ గా నిలుస్తారని ఆయన వివరించారు. సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి కాంగ్రెస్ ప్రచారానికి చిరు రంగంలోకి దిగుతారని, ఈ విషయం రాహుల్ గాంధీకి కూడా చిరు చెప్పారని ఆయన చెప్పారు. మొత్తంగా రాహుల్ కు చిరు క్లారిటీ ఇచ్చిన తరువాతే సినిమాల్లో బిజిగా మారినట్లుగా ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఒకవేళ చిరు ప్రచార రంగంలోకి దిగితే ఎన్నికల ప్రచారంలో చిరు, పవన్ లు ఒకరికొకరు ఎదురుపడితే ఎలా ఉంటుందో చూడాలి మరి.