బ్రేకింగ్ : మంత్రి జోగు రామన్నకు తప్పిన ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర మంత్రి జోగు రామన్నకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. మంచిర్యాల జిల్లా కేంద్రం లో ఓ ప్రయివేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు మంత్రి జోగు రామన్న. లిఫ్ట్ లో వెళుతున్న క్రమంలో ఒక్కసారిగా లిఫ్ట్ తెగి పడింది. అయితే అక్కడి సిబ్బంది అప్రమత్తమవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.