క్రికెట్’కు కులం.. కైఫ్ ఫైర్ !
క్రికెట్ కు కులాన్ని ఆపాదించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భారత క్రికెట్‌లోనూ అసమానత్వం రాజ్యమేలుతోంది. ‘ఎస్సీ, ఎస్టీ ఆటగాళ్లకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదు’ అంటూ.. ‘ది వైర్’ అనే ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ఈ కథనంపై తీవ్ర విమర్శలొస్తున్నాయ్. దీనిపై మహమ్మద్ కైఫ్ ఘాటుగా స్పందించారు.
‘మీ సంస్థలో ఎంతమంది ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన జర్నలిస్టులు ఉన్నారో’ చెప్పాలని నిలదీశాడు. క్రీడలు అనేవి కులమతాలకు అతీతమైనవి. ఆటగాళ్లు కలుపుగోలుగా ఆడతారు. ద్వేషాన్ని విస్తరింపజేసే జర్నలిజం మనకు అక్కర్లేదంటూ ఘాటుగా ట్వీట్ చేశాడు కైఫ కైఫ్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి.
క్రికెట్ నుంచి రిటైరైనా కైఫ్ సిక్సర్లు కొట్టడం ఆపడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఇటీవలే కైఫ్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తన కెరీర్ లో 13 టెస్టులు, 125 వన్డేలకు కైఫ్ ప్రాతినిధ్యం వహించాడు కైఫ్. టెస్టుల్లో 624 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. 125 వన్డేల్లో 2753 పరుగులు సాధించగా… అందులో 2 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.