జగన్‌ను నిలదీసిన ముద్రగడ

వైసీపీ అధినేత జగన్ ని వాయించేశాడు మాజీ మంత్రి, కాపుల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం . ‘కాపు రిజర్వేషన్‌పై హామీ ఇవ్వలేనన్న మీకు.. మేమెందుకు ఓటు వేయాలని’ నిలదీశారు. ఆదివారం కాకినాడలో మీడియాతో మాట్లాడిన ముద్రగడ.. జగన్ ని లైఫ్టు, రైటు వాయించేశాడు. కాపు రిజర్వేషన్‌ అంశం రాష్ట్ర పరిధి కాదు. అది కేంద్రం చేయాల్సిన పని అంటున్నారు జగన్. మరీ.. ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పదవీకాంక్ష కోసమే జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు. కాపులను విమర్శించి ఇతర కులాలకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

రాజమండ్రి వంతెన వద్ద జగన్‌ పాదయాత్రకు ఎదురు వెళ్లి స్వాగతం పలకమని ఆయన అనుచరుల ద్వారా కోరారు. ‘ఏం చేశారని.. ఏం చేస్తారని ఎర్ర తివాచీ వేసి స్వాగతం పలకాలి’.. అని ప్రశ్నించారు ముద్రగడ. జగన్ కాపులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాపులకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తామని నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు మధ్య పోటీపెట్టి పాదయాత్రకు రూ.లక్షల కోట్లు ఖర్చుపెట్టిస్తున్నారని ఆరోపించారు. మావాళ్లు ఖర్చుచేస్తున్న డబ్బు అక్రమంగా సంపాదించింది కాదని చురకలంటించారు.

ఇన్నాళ్ల్లు కాపుల రిజ్వేషన్ కోసం చంద్రబాబు ప్రభుత్వంతో పోరాడుతున్న ముద్రగడ.. జగన్ ను అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా ముద్రగడ జగన్ ని నిలదీసిన తీరు చూస్తే.. ఆయన ఏ పార్టీకి వంతన పాడటం లేదు. కాపుల రిజ్వేషన్, వారి అభివృద్ధికి ఏ పార్టీ పోరాడితే దానికే ముద్రగడ సపోర్టు ఉంటుందన్నది స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరీ.. ముద్రగడ ప్రశ్నలపై జగన్ రియాక్షన్ ఏంటీ? అన్నది చూడాలి.