రష్మిక ఏంటీది.. ? ఒకరితో ఎంగేజ్ మెంట్.. మరొకరితో రొమాన్స్ !


హీరోయిన్ రష్మిక మందనని నెటిజర్స్ టార్గెట్ చేశారు. ఒకరితో నిశ్చితార్థం జరిగిన తర్వాత మరొకరితో రొమాన్స్ చేయడమేంటీ ? అని ప్రశ్నిస్తున్నారు. హీరో రక్షిత్ షెట్టిని పెళ్లాడనుంది రష్మిక. ఇప్పటికే వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. త్వరలోనే వివాహం జరగనుంది. ఐతే, పెళ్లికి గ్యాప్ లో రష్మికకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగు ఆమె రెండో సినిమాగా ‘గీత గోవిందం’ రానుంది. ఐతే, ఈ సినిమాలో రష్మిక హీరో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయడంపై నెటిజర్స్ మండిపడుతున్నారు.

గీత గోవిందం.. రొమాంటిక్ ఎంటర్ టైనర్. దానికి తగ్గట్టుగానే ప్రచార చిత్రాలని విడుదల చేసింది చిత్రబృందం. విజయ దేవరకొండ వీపుపై రష్మిక ఎక్కిన ఫోటో ఆకట్టుకుంటోంది. ఐతే, ఈ రొమాంటి ఫోటోపై నెటిజర్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకరితో నిశ్చితార్థం.. మరొకరితో రొమాన్స్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో దూషించారు. ఐత్తఏ, ఈ కామెంట్స్ పై రష్మిక గట్టిగా సమాధానం చెప్పింది.

‘కొందరు ఫేక్ అకౌంట్లను సృష్టించి నాపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. కొందరికి గట్టిగా సమాధానం చెబితే క్షమాపణ చెప్పారు. మనుషులమని కొందరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పెళ్లైనా హీరోయిన్ తెర మీద హీరోతో రొమాన్స్ చేస్తే తప్పు. అదే పెళ్లైన హీరో మరో హీరోయిన్‌తో తెరపై రొమాన్స్ చేస్తే.. తప్పు కనిపించదు’ అని చురకలంటిచారు. ఇటీవల సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఇలాంటి ట్రోల్స్ ని ఎదుర్కొంది. తాప్సీ నువ్వొక చెత్త నటివని.. ఓ నెటిజర్ కామెంట్స్ చేస్తే.. ఆయనకి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది తాప్సీ.