పూజా హవాని అడ్డుకున్న రకుల్ !

టాలీవుడ్ లో హీరోయిన్ పూజా హెగ్డే హవా కొనసాగుతోంది. ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్’ తర్వాత ఆమె దశ తిరిగింది. వరుసగా స్టార్ హీరోలతో జతకడుతోంది. బన్నీ తర్వాత చరణ్ తో చిందేసింది. ‘రంగస్థలం’ ఐటమ్ సాంగ్ లో హాట్ హాట్ మెరిసింది. ప్రస్తుతం మహేష్ 25, తారక్ ‘అరవింద సమేత’లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు విడుదలైతే పూజా రేంజ్ మరింతగా పెరగవచ్చు. అంతకంటే ముందు ప్రభాస్ సినిమాలోనూ పూజా ఛాన్స్ కొట్టేసిందనే వార్తలొచ్చాయ్.

ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’తో బిజీగా ఉన్నాడు. భారీ బ‌డ్జెట్‌తో ఒళ్ళు గ‌గుర్పొడిచే యాక్ష‌న్ సీన్స్‌తో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ‘జిల్’ ఫేం రాథాకృష్ణ తో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే పక్కాగా స్క్రిప్టు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు వినిపించింది. మంచి హైట్, గ్లామర్.. ప్రభాస్ కు సరిజోడీ అవుతుందని చెప్పుకొన్నారు. ఐతే, ఇప్పుడీ ఆఫర్ ని రకుల్ ప్రీత్ సింగ్ ఎగిరేసుకుపోయేలా ఉంది. ఆమెతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారమ్. ఒకవేళ ఈ ఆఫర్ రకుల్ కొట్టేస్తే.. పూజా హవాకు బ్రేకులు వేసినట్టే.. !