కికి ఛాలెంజ్ : హాఫ్ శారీలో రెజీనా.. అదరగొట్టేసింది !
‘కికి ఛాలెంజ్’ ఛాలెంజ్ సెలబ్రిటీలకు కిక్కునిస్తోంది. పాప్ సింగర్ డ్రేక్ కొత్త ఆల్బమ్ ‘స్కార్పియన్’ లో ‘ఇన్ మై ఫీలింగ్స్’ అనే సాంగ్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారింది. ఈ సాంగ్ లోని “కికి.. డు యు లవ్ మీ’ పదాలున్నాయి. దీంతో హాలీవుడ్ కమెడియన్ షిగ్గి కిక్ ఛాలెంజ్ ని తీసుకొచ్చారు. ఈ ఛాలెంజ్ లో ఒక వెహికల్ నుండి దిగి డాన్స్ వేసి మళ్ళీ వెహికల్ ఎక్కాలి. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. ఇప్పుడీ ఛాలెంజ్ టాలీవుడ్ కు పాకింది.
‘హార్ట్ ఎటాక్’ హీరోయిన్ అదా శర్మ కికి ఛాలెంజ్ లో పాల్గొంది. ‘ఇన్ మై ఫీలింగ్స్ పాటకు ట్రెడిషనల్ డాన్సర్ డ్రెస్ లో కథక్ డాన్స్ చేసింది. కారు నుండి దిగి నాట్యం చేసి ఆ తర్వాత కారెక్కింది. అదా డ్యాన్స్ ప్రేక్షకులకు కిక్ నిచ్చింది. ఆమెకు బోలేడు పబ్లిసిటీని తీసుకొచ్చింది. తాజాగా, హీరోయిన్ రెజీనా కిక్ ఛాలెంజ్ స్వీకరించింది. హాఫ్ శారీలో కారులో.. కారు దిగి డ్యాన్స్ చేసింది. ఇప్పుడు రెజీనా కిక్ ఛాలెంజ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#inmyfeelingschallenge had to be done!!!@champagnepapi you’ve got us South Indian girls dancin to your tunes.. 😂😋
This is the craziness that goes on between shots… 🙄😛
Video and styling: @jaya_stylist
Music supervision:#priyankatumpala pic.twitter.com/dTA1enB9Nt— ReginaCassandra (@ReginaCassandra) July 29, 2018