‘అల్లూరి సీతారామరాజు’గా ఎన్టీఆర్ ?


యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారమ్. అదికూడా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తారక్-చరణ్’లతో ఓ మల్టీస్టారర్ (#ఆర్ఆర్ఆర్)ని చేయబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ నుంచి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. దాదాపు రూ. 300కోట్ల బడ్జెట్ తో ఈ మల్టీస్టారర్ తెరకెక్కనుంది. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నారు.

ఈ మల్టీస్టారర్ లో చరణ్-తారక్’లకు సమాన ప్రాధాన్యం ఉండేలా రాజమౌళి ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇప్పుడీ సినిమాలో తారక్ పాత్ర ఏంటన్నది కూడా లీకైంది. ఆయన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారమ్. #ఆర్ఆర్ఆర్ హిస్టారికల్ బ్యాగ్రౌండ్ తో తెరకెక్కనుంది రాజమౌళి చెప్పలేదు. అలాంటిది తారక్ సీతారామరాజు పాత్రలో కనిపిస్తాడని చెప్పుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బహుశా.. సినిమాలో తారక్ పాత్ర పేరు అల్లూరి సీతారామారాజుగా అయి ఉంటుందేమో.. !

బాహుబలి రేంజ్ లో #ఆర్ఆర్ఆర్ సినిమాని విడుదల చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేశారని తెలిసింది. తెలుగు, తమిళం, హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నారు. బాలీవుడ్ బాధ్యతని కరణ్ జోహార్‌ పై పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్ హీరోయిన్స్ లిస్టులో సమంత, అలియా భట్, కీర్తి సురేష్, పూజా హెగ్డే, జాహ్నవి కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప.. #ఆర్ఆర్ఆర్ పై క్లారిటీ వచ్చేట్టు లేదు.