బిగ్ బాస్ @50.. బంపర్ ఆఫర్.. !

ఆదివారంతో తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ’50రోజులు’ పూర్తి చేసుకొంది. ఈ స్పెషల్ ఏపీసోడ్ మరింత స్పెషల్ గా సాగింది. ఇంటి సభ్యులకు ఆరు బయట చిన్న గేమ్ పెట్టారు. నామినేషనల్ ఉన్న వారిని ఒకలైన్‌లో నిలబెట్టి.. మరో లైన్‌లో నామినేషన్‌లో లేనివారిని నిలబెట్టారు. నామినేషన్‌కు గురైన వారిని వాటర్ బెలూన్లతో కొట్టి వారు ఇంటిలో ఎందుకు ఉండకూడదో చెప్పించారు. ఆ తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లి.. ఎలిమినేషన్ పై ఊరించి, ఉడికించి.. ఈ వారం అసలు ఎలిమినేషన్ నే లేదని చెప్పేశాడు. దీంతో హౌస్‌లో మారుమ్రోగిపోయింది.

ఇప్పటికే షో నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లలో ఒకరు రీ-ఎంట్రీ ఇవ్వనున్నారనే సంగతి తెలిసిందే. ఐతే, ఒకరు కాదు.. ఇద్దరిని ఇంట్లోకి ఎంట్రీ ఇప్పించారు. నూతన్ నాయుడు, శ్యామల రీఎంట్రీ ఇచ్చారు. నూతన్ నాయుడికి శ్యామల కన్నా కాసిన్ని ఓట్లు అధికంగా వచ్చాయి. అయినా… వీరిద్దరిని హౌస్ లోనికి వెళ్లే అవకాశాన్ని కల్పిపించారు. తాను ప్రేక్షకుల వల్ల ఎలిమినేట్ కాలేదని, హౌస్ మేట్స్ తనను ఎలిమినేట్ చేశారన్న విషయాన్ని చెప్పి శ్యామల ఓట్లు అడిగింది. ఇక, ఎలిమినేట్ అయ్యాక నూతన్ నాయుడు వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకొంది.

ఇదీగాక, ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని అన్న సంగతి తెలిసింది. దాంతో పాటు కౌశల్ ఆర్మీ నూతన్ నాయుడికి మద్దతు పలికింది. ఈ కారణాలతోనే ఆయన అత్యధిక ఓట్లు సాధించుకొని మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక, కొత్త బర్నింగ్ స్టార్ గా విజృంభిస్తానని తెలిపారు నూతన్. మొత్తానికి.. బిగ్ బాస్ 50వ ఏపీసోడ్ లో డబుల్ ధమాకా అందజేశారు. ఐతే, ముందు ముందు వారాల్లో ఒకేసారి ఇద్దరినీ బయటకు పంపే ఆలోచనలో బిగ్ బాస్ ఉన్నట్టు సమాచారమ్.