కరుణ ఆరోగ్యం.. టెన్షన్ టెన్షన్ !

కరుణానిధి ఆరోగ్యంపై కావేరి ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ టెన్షన్ కు గురిచేసింది. ఆదివారం రాత్రి 10.50కి కరుణానిధి ఆరోగ్యం కొద్ది సమయం విషమించిందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. దీనికి తోడు ముఖ్యమంత్రి పళనిస్వామి సేలం పర్యటనలో రద్దు చేసుకోవడం, కావేరి ఆస్పత్రి వద్ద ఖాళీ అంబులెన్సును సిద్ధంగా ఉంచడం, చెన్నైలో మూడు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడంతో డీఎంకే కార్యకర్తలని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. కొద్దిసేపట్లో చేధువార్త వినబోతున్నామని అనుకొన్నారు.

ఐతే, ఇంతలో డీఎంకే సీనియర్‌ నేత ఎ.రాజా కరుణానిధి ఆరోగ్యం కుదుటపడిందని, ఆయన కోలుకుంటున్నారని, వందతులు నమ్మద్దని ప్రకటన చేయడంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు.అంతకుముందు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కావేరి ఆస్పత్రిలో చికిత్సకి వచ్చి కరుణానిధిని పరామర్శించారు. కరుణానిధి ఆరోగ్యంపై కుటుంబం సభ్యులని ఆరా తీశారు.ఆయన వెంట గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి జయకుమార్‌ ఉన్నారు.

కరుణానిథి ఆరోగ్యం విషమించిందన్న వార్తల నేపథ్యంలో డీఎంకే కార్యకర్తలతో ఆందోళన నెలకొంది. కరుణ ఆరోగ్యం విషమంగా ఉందన్న విషయం తట్టుకోలేక ముగ్గురు డీఎంకే కార్యకర్తలు మరణించారు. వీరిలో ఇద్దరు గుండెపోటుతో మరణించగా.. ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు.