బన్నీ నా కోసం రాలేదు.. !
హీరో విజయ్ దేవరకొండ తీరు వేరు. ఏమాత్రం మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంటారు. అప్పుడప్పుడు అవి సంచలనంగా మారుతుంటాయి. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ‘గీత గోవిందం’ ఆడియో వేడుకలోనూ విజయ్ మాటలు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ వేడుకకి స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఐతే, బన్నీ నా కోసం మాత్రం రాలేదు. బహుశా.. వాళ్ల నాన్న అరవింద్ కోసం వచ్చి ఉంటారు అన్నారు విజయ్. విజయ్ మాటలతో బన్నీ మొహంలో బ్రయిట్ నెస్ తగ్గినట్టు అనిపించింది.
ఆ తర్వాత మాట్లాడిన బన్నీ మాత్రం విజయ్ దేవరకొండాని పొగడ్తలతో ముంచెత్తారు. విజయ్ గ్రేట్ ఫర్ ఫార్మర్. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి బెస్ట్ ఫర్ ఫామెన్స్ ఇచ్చారు. ఆయన నటనకు ఉత్తమ నటుడు అవార్డు రావాలని అనుకొన్నా. అలాగే ఉత్తమ నటుడుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చిందన్నారు. ఇక, తాను ఇక్కడికి బన్నీ వాసు కోసం వచ్చా. నా కెరీర్ కి మా నాన్న తర్వాత.. ఆ రేంజ్ లో సహాయం చేసిన వ్యక్తి బన్నీ వాసు. ఆయన చేసిన పతి సినిమాకు నేను వస్తానని తెలిపారు.