ఛాలెంజ్’ని పూర్తి చేసిన మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు మంత్రి కేటీఆర్ సవాల్ కు సమాధానం ఇచ్చారు. కూతురు సితారతో కలిసి కేటీఆర్ సవాల్ ని పూర్తి చేశాడు మహేష్. సితారతో కలిసి మొక్కలు నాటారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. హరితహారంలో భాగంగా ఈ ‘గ్రీన్ ఛాలెంజ్’ని ఎంపీ కవిత తీసుకొచ్చారు. కవిత విసిరిన ఈ గ్రీన్ ఛాలెంజ్ ని దర్శకధీరుడు రాజమౌళి పూర్తి చేశాడు. ఆయన మంత్రి కేటీఆర్, పుల్లెల గోపీచంద్, దర్శకుడు సందీప్ వంగా, నాగ్ అశ్విన్ ఈ ఛాలెంజ్ విసిరారు.
రాజమౌళి నుండి ఛాలెంజ్ స్వీకరించిన కేటీఆర్.. దాన్ని పూర్తి చేసి.. యుఎస్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా, మహేష్ బాబు తదితరులకు ఛాలెంజ్ విసిరారు. కేటీఆర్ నుండి గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించిన యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ దానిని పూర్తిచేసి.. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు అదే ఛాలెంజ్ ని విసిరారు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇప్పటికే ఈ ఛాలెంజ్ ని పూర్తి చేశాడు. ఐతే, మహేష్ ఈ ఛాలెంజ్ ని పూర్తి చేయడానికి టైం తీసుకోవడంతో.. ఆయన కేటీఆర్ ఛాలెంజ్ ని పట్టించుకోవడం లేదనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.
ఈ ప్రచారానికి చెక్ పెడుతూ.. తాజాగా కేటీఆర్ ఛాలెంజ్ ని కూతురు సితారతతో కలిసి పూర్తి చేశాడు మహేష్. ఈ ఛాలెంజ్ ని మహేష్ తన కొడుకు గౌతమ్, కూతురు సితారలతో పాటు దర్శకుడు వంశీపైడిపల్లికి విసిరారు. ఇక, ప్రస్తుతం మహేష్ తన 25వ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకుడు. ఇందులో మహేష్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారమ్. మహేష్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా కనిపించనున్నారు. దిల్ రాజు-అశ్వినీదత్-పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Your green challenge accepted @ssrajamouli Garu👍
By the way, loved your buddy in the pic 🐕 😊 https://t.co/LOcqk2GtU9
— KTR (@KTRTRS) July 24, 2018
And here it is. Completed my challenge. @USCGHyderabad Got my children at. @IVidyanikethan also to participate. Now I ask everyone following me to take up the challenge. Need more green cover. Send me your photos. pic.twitter.com/yOfavoaDmq
— Mohan Babu M (@themohanbabu) July 29, 2018
Challenge accepted, @KTRTRS ! @USAndHyderabad is now home to three new Xora, Helonica, and Mony Plants! Here’s hoping @themohanbabu @MirzaSania @Andrew007Uk and @THubHyd accept the 3 plant challenge! pic.twitter.com/Go4vbnbvTb
— Katherine Hadda (@USCGHyderabad) July 27, 2018