నాని టికెట్’తో బన్నీ పోటీ.. !
నేచురల్ స్టార్ నానికి దక్కిందనుకొన్న టికెట్ తో అనూహ్యంగా స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ పోటీ చేయబోతున్నట్టు సమాచారమ్. ఇక్కడ మాట్లాడుకొంటున్నది పొలిటికల్ గురించే. నాని పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ‘సభకు నమస్కారం’ టైటిల్ కూడా అనుకొన్నారు. దిల్ రాజు బ్యానర్ లో ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కబోతున్నట్టు చెప్పుకొన్నారు. ఐతే, దర్శకుడు ఎవరు ? అన్నది మాత్రం చెప్పలేదు. ఈ పొలిటికల్ వార్తని నాని కూడా ఖండించలేదు. దీంతో నాని పొలిటికల్ పై జరుగుతున్న ప్రచారం నిజమే అనుకొన్నారంతా. ఐతే, ఇప్పుడు నాని టికెట్ ని బన్నీ చేజిక్కించుకొన్నట్టు సమాచారమ్.
‘నా పేరు సూర్య’ తర్వాత ఓ మంచి కథ కోసం బన్నీ వెయిట్ చేస్తున్నాడు. ఓకే అయిందనుకొన్న విక్రమ్ కె కుమార్ సినిమా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో బన్నీకి అర్జెంటుగా ఓ కథ కావాలి. ఆ అవసరం గుర్తించిన నిర్మాత దిల్ రాజు నాని కోసం అనుకొన్న పొలిటికల్ థ్రిల్లర్ కథని బన్నీకి వినిపించాడట. అది బన్నీకి బాగా నచ్చినట్టు తెలిసింది. ఐతే, ఈ కథని ఏ దర్శకుడు చేతిలో పెట్టాలనే విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని టాక్. ఇదే నిజమైతే నాని టికెట్ బన్నీ కొట్టేసినట్టే. మరీ.. ఘన విజయం సాధిస్తాడో.. ? లేదో.. ? చూడాలి.
టాలీవుడ్ స్టార్స్ పొలిటికిల్స్ లోకి ఇంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. యంగ్ హీరో రానా దగ్గుపాటి ఒకటి కాదు.. ఏకంగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఎత్తులు-పైఎత్తులతో ప్రత్యర్థులని చిత్తు చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ యేడాదియే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. సామాజిక బాధ్యతని గుర్తిచేసి.. శభాష్ అనిపించుకొన్నారు. ఇప్పుడు బన్నీ టైం వచ్చింది. ఆయన పొలిటికల్స్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అందులో ఏ మేరకు రాణీస్తాడు ? పొలిటికల్ కెరీర్ ఎలా సాగనుంది.. ?? అనేది చూడాలి.