అబద్దం చెప్పినా పసిగట్టే కెమెరాలు..!!
నిందితులు చెబుతోంది అబద్దమా, లేక నిజమా అంటూ సరైన సాక్ష్యం చెప్పించేందుకు లై డిటెక్టర్ లను వినియోగించడం విన్నాం, చూసాం. అయితే టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు అబద్దం చెప్పినా పసిగట్టే కెమెరాలు వచ్చేసాయి. బాడీ కెమెరాగా పిలిచే ఈ కెమెరాలతో ఆ వ్యక్తి చెబుతుంది నిజమా , అబద్దమా ఇట్టే పసిగడతాయట. మూడేళ్ల క్రితమే బాడీ కెమెరాను కర్నాటకలోని మైసూరులో పోలీసులు ఈ కెమెరాలను ప్రవేశపెట్టారు. ఇవి విజయవంతం కావడంతో తాజాగా చిక్కబళ్లాపుర జిల్లాలో అమలు చేస్తున్నారట.
ఎనిమిది గంటపాటు వీడియో, ఫోటో రికార్డు చేసే సదుపాయం కలిగిన ఈ కెమరాలను బీపీఎల్ సంస్థ తయారు చేసింది. ప్రతీ పోలీస్ ఇన్‌స్పెక్టర్, సిఐలు తమ చొక్కాలకు ధరించి విధి నిర్వ హణలో కెమెరాను ఆన్‌మోడ్‌లో ఉంచాల్సి ఉంటుంది. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిం చేవారు ఇక ఏమాత్రం తప్పించుకునే అవకా శం ఉండదు. నియమాలు ఉల్లంఘించి ఉం టే, తప్పు ఎవరిది ఉన్నా అవి తప్పనిసరిగా కెమెరాలో రికార్డు అవుతాయి. దీంతో నియ మాలు ఉల్లంఘించేవారి భరతం పట్టను న్నారు పోలీసులు.