‘శైలజారెడ్డి అల్లుడు’ టీజర్ టాక్


మారుతి దర్శకత్వంలో నాగచైతన్య – అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. చైతూ కొంటెతనం, అను ఇమ్మాన్యుయేల్ ఇగోని, రమ్యకృష్ణ స్టయిల్ ని టీజర్ లో చూపించారు. ‘ఈ పిల్లే ఇలా ఉంటే.. ఈవిడ తల్లి ఎలా ఉంటుందో ?’నని చైతూతో అంటున్నాడు. ‘పిల్ల పిట్టలా ఇంతే ఉన్నా.. పొట్టంతా ఇగోనే’ ‘ఇప్పుడు నువ్వు ఐ లవ్‌ యు అని ప్రపోజ్‌ చెయ్‌‌.. ఐ లవ్‌ యు టూ అని ఒప్పుకుంటా’ అంటూ అను అంది.

రమ్యకృష్ణ టైటిల్ రోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ సినిమాలోని ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు’ పాటను ఈ సినిమా కోసం రీమేక్‌ చేశారు. ఈ రీమేక్‌ పాటలో తమన్నా మెరవనుంది. ఈ చిత్రానికి సంగీతం గోపీ సుందర్‌. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ ఎస్‌, పీడీవీ ప్రసాద్ ‌సినిమాను నిర్మిస్తున్నారు.