చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్..!!

హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్లతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాలు, ఏపీలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ చెడ్డీ గ్యాంగ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంగ‌తి తెలిసిందే. చెడ్డీ గ్యాంగ్ ను ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు. ఎలాగైనా స‌రే చ‌చెడ్డీ గ్యాంగ్ ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని తెలంగాణ పోలీసులు భావించారు.

ఇటీవల రాచకొండ, సైబరాబాద్‌ పరిధిలో అనేక దొంగతనాలకు యత్నించినట్లు ఈ ముఠాకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు పోలీసులకు లభించాయి. ప్రత్యేక పోలీసు బృందాలు వారికోసం వేట కొనసాగించాయి. చెడ్డీ గ్యాంగ్‌ ముఠా గుజరాత్‌ రాష్ట్రంలో సంచరిస్తున్నట్లు రాచకొండ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రెండు ప్రత్యేక పోలీసు బృందాలు అక్కడికి వెళ్లి చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.