తొలి టెస్టు : ఇంగ్లాండ్ 285/9, అశ్విన్ కు 4వికెట్లు
కోహ్లీ సేన మరోసారి అదిరిపోయే ఆరంభం చేసింది. తొలి టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లిష్ జట్టును 285/9 (88 ఓవర్లు)తో కట్టడి చేసి… ఐదు టెస్టుల సిరీస్‌ను ఆశావహ దృక్పథంతో ఆరంభించింది. ఫాస్ట్‌బౌలర్ల గడ్డ అయిన ఎడ్జ్‌బాస్టన్‌లో స్పిన్నర్ అశ్విన్ 4 వికెట్లతో విజృంభించడం తొలి రోజు ఆటలో హైలైట్. ప్రస్తుతం కురన్ (24), అండర్సన్ క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో రూట్ 80, బెయిర్‌స్టో 70, జెన్నింగ్స్ 42 పరుగులతో రాణించారు.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ :
కుక్ (బి) అశ్విన్ 13; జెన్నింగ్స్ (బి) షమి 42; రూట్ రనౌట్ 80; మలన్ ఎల్బీ (బి) షమి 8; బెయిర్‌స్టో (బి) ఉమేశ్ 70; స్టోక్స్ (సి) అండ్ (బి) అశ్విన్ 21; బట్లర్ ఎల్బీ (బి) అశ్విన్ 0; కుర్రన్ బ్యాటింగ్ 24; రషీద్ ఎల్బీ (బి) ఇషాంత్ 13; బ్రాడ్ ఎల్బీ (బి) అశ్విన్ 1; అండర్సన్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు మొత్తం: (88 ఓవర్లలో 9 వికెట్లకు) 285;
బౌలింగ్ :
ఉమేశ్ యాదవ్ 17-2-56-1; ఇషాంత్ శర్మ 17-1-46-1; అశ్విన్ 25-7-60-4; షమి 19-2-64-2; హార్దిక్ పాండ్య 10-1-46-0