సమంతకు నాగ్ సవాల్


కోడలు సమంతని నాగార్జున సవాల్ చేశాడు. ఆమెకు గ్రీన్ ఛాలెంజ్ ని విసిరారు. తనకి టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ సిరిన ‘గ్రీన్ ఛాలెంజ్’ను నాగ్ పూర్తి చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ విషయాన్ని నాగార్జున తన ట్వీట్ ద్వారా తెలిపారు. ‘మీకు మాటిచ్చినట్టే అన్నపూర్ణ స్టూడియోస్ లో మా సిబ్బందితో కలిసి మొక్కలు నాటాను. ఇక మీ వంతు ఫ్రెండ్స్! కరణ్ జోహార్, కార్తీ, ధనుష్ కె రాజా, నా కోడలు సమంత ఈ గ్రీన్ ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా’ అంటూ ట్వీట్ చేశారు నాగ్. తమ సిబ్బందితో కలిసి మొక్కలు నాటుతున్న ఫొటోలను నాగార్జున పోస్ట్ చేశారు. మరీ.. మామ సవాల్ ని సమంత ఎప్పుడు? పూర్తి చేస్తుందో చూడాలి.

ఇక, అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమాలు థియేటర్ కు క్యూ కట్టనున్నాయి. నాగ చైతన్య నటిస్తున్న రెండు సినిమాలు శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి కొద్దిపాటి గ్యాప్ లోనే విడుదల కానున్నాయి. ఆ తర్వాత సమంత ‘యు టర్న్’ రానుంది. వీరితో పాటు అఖిల్ అక్కినేని కూడా క్యూలోనే ఉన్నాడు. ఇవన్నీ వచ్చి వెళ్లే లోగా నాగార్జున నటిస్తున్న బాలీవుడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.