శామ్‌సంగ్‌ నెం.1 అనిపించుకొంది

శామ్‌సంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ నెం.1 స్థానంలో నిలిచింది. 2018 రెండో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల్లో 20శాతం మార్కెట్‌ వాటాతో శామ్‌సంగ్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో చైనాకు చెందిన హువావే రెండో స్థానం దక్కించుకుంది. అమెరికా దిగ్గజం యాపిల్‌ను హువావే వెనక్కినెట్టేయడం విశేషం. ఈ మేరకు కౌంటర్‌పాయింట్‌ రీసర్చ్‌కు చెందిన మార్కెట్ మానిటర్‌ సర్వీస్‌ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో శామ్‌సంగ్‌ 73 మిలియన్‌ యూనిట్లను ఎగుమతి చేయగా.. హువావే 54 మిలియన్‌ యూనిట్లు, యాపిల్‌ 41 మిలియన్‌ ఐఫోన్లను ఎగుమతి చేసింది. ఈ జాబితాలో 9శాతం వాటాతో షామీ నాలుగో స్థానంలో ఉంది.