విజయ్ ఆంటోనీ ‘రోషగాడు’ మోషన్ పోస్టర్


తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ. ఆయన నటించిన ‘బిచ్చగాడు’ తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకొంది. మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతోంది. బేతాళుడు, యమన్, ఇంద్రసేన, కాశీ సినిమాలతో ఆకట్టుకొన్నాడు విజయ్. ఆయన తాజా చిత్రం ‘తిమిరపుడిచవాన్’ అనే చిత్రం తెలుగులో ‘రోషగాడు’ పేరుతో విడుదల కాబోతోంది. పోలీస్ డ్రెస్ లో యాంగ్రీ యంగ్ మెన్ గా కనిపిస్తున్న విజయ్ పోస్టర్ ని మోషన్ పోస్టర్ వదిలారు.

ఇందులో విజయ్ ఆంటోని కుమారస్వామి అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మోషనల్ పోస్టర్లో ”ఒళ్లంతా పొగరురా… పొగరుకె మొగుడురా… మొగుడురా పొగరుకే.. పడడు మాట రోషగాడు రా..’ అంటూ లిరిక్స్ హీరో క్యారెక్టర్ ని తెలియజెస్తోంది. ఈ చిత్రానికి గణేషా దర్శకత్వం వహించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ ప్రై.లి, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతుతోంది.

ఇక, సినిమాని ప్రమోట్ చేయడంలో విజయ్ స్టయిలే వేరు. విడుదలకు ముందు ఓ ఐదు, పది నిమిషాల సినిమాని యూట్యూబ్ లో విడుదల చేస్తుంటాడు. అది సినిమాపై అంచనాలని ఓ రేంజ్ లో పెంచాలా ఉంటుంది. ఇప్పుడు రోషగాడు కోసం ఇదే ఫార్ములాని ఫాలో అయిపోతాడేమో చూడాలి.