‘చి ల సౌ’ పబ్లిక్ టాక్
నటుడు రాహుల్ దర్శకుడిగా మారి తీసిన చిత్రం ‘చి।।ల।।సౌ’. సుశాంత్, రుహాని శర్మ జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఇప్పటికే ఉదయం ఆట పడిపోయింది. పబ్లిక్ టాక్ బయటికొచ్చింది.
ట్రైలర్ లో చూపించినట్టుగా అర్జున్ (సుశాంత్) పెళ్లి అంటే ఇష్టం లేని ఒక యువకుడిగా కనిపించాడు. కమెడియన్ వెన్నెల కిశోర్ సుశాంత్ స్నేహితుడుగా కనిపించాడు. నవ్వులు పంచాడు. హీరోయిన్ గా రుహానిశర్మ-సుశాంత్ ల పెళ్లి చూపుల సీన్, హీరోయిన్ పెళ్లిచూపులు ఒక్కొక్కటిగా ఫెయిల్ అవడం ఫ్లాష్ బ్యాక్ లో చూపించారు. హీరో-హీరోయిన్స్ మధ్య కొన్ని డైలాగ్స్, చిన్న గొడవ, కాస్త ఎమోషన్స్ తో ఫస్టాఫ్ ని ముగించారు. చెప్పడానికి సింపుల్ గా అనిపిస్తున్నా.. సినిమా చాలా నేచురల్, ఫ్రెష్ గా అనిపించింది. మొత్తానికి ఫస్టాఫ్ బాగుంది.
సెకాంఢాలో రొమాంటిక్ సీన్స్ హైలైట్ గా ఉన్నాయి. సెకాంఢాఫ్ ని రొమాంటిక్ గా మొదలెట్టిన దర్శకుడు.. ఓ ట్విస్టుతో కొద్దిసేపు సడెన్ గా సీరియస్ మూడులోకి తీసుకెళ్లాడు. ఆ ట్విస్టు క్లియర్ అయిన వెంటనే కథ మళ్లీ రొమాంటిక్ మూడ్ లోకి వచ్చేసింది. సెకాంఢాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. లవ్ స్టోరీ లో సమస్యలు మెల్లగా ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ.. ఫామిలీ ఎమోషనల్ సన్నివేశాలతో కథని రక్తికట్టించాడు దర్శకుడు. మంచి ఎమోషనల్ రొమాంటిక్ సీన్ తో క్లైమాక్స్ ని ప్లాన్ చేశారు. రుహానిశర్మ-సుశాంత్ ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. మొత్తంగా సినిమా ఫ్రెష్ గా కొత్తగా ఉంది.