రివ్యూ : గూఢచారి
చిత్రం : గూఢచారి (2018)
నటీనటులు : అడవి శేష్, శోభిత ధూళిపాళ్ళ , సుప్రియ, ప్రకాష్ రాజ్ .. తదితరులు
రచయిత : అడవిశేష్, అబ్బూరి రవి
సంగీతం : శ్రీచరణ్
నిర్మాత : అభిషేక్ పిక్చర్స్
దర్సకత్వం : శశి కిరణ్ తిక్క
రేటింగ్ : 3.5/5
గత ఏడాది’ క్షణం’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అడవి శేష్. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. రచయితగా, నటుడుగా అడవి శేష్ కు సంతృప్తినిచ్చిన చిత్రమిది. ఈ సినిమా తర్వాత ఆయనకు పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ఇలాంటి దాదాపు 50 ఆఫర్లని తోసిపుచ్చాడు. మరోసారి ఆయనకు సంతృప్తినిచ్చే కథని రెడీ చేసుకొన్నాడు. అదే ‘గూఢచారి’. సినిమా ప్రమోషన్ మెటిరియల్ సినిమాపై అంచనాలను పెంచింది. రా ఆఫిసర్ కధ అంటూ ఆసక్తిని రేపారు. టేకింగ్, మేకింగ్ పరంగా హాలీవుడ్ చిత్రాలకి ధీటుగా హైటెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమా తీసినట్లు ట్రైలర్ చూస్తే అనిపించింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ తొలి హీరోయిన్ సుప్రియ ఈ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం కూడా ఆసక్తకరమైన అంశం. ఇలా పాజిటి మంచి బజ్ తో ‘గూఢచారి’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మరీ.. ట్రైలర్ లో చూపించిన థ్రిల్ ని సినిమాలో ఇవ్వగలిగారా ? అసలు ‘గూఢచారి’లో ఏ మేరకు విషయముంది.. ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కధ :
గోపి ( అడవిశేష్) తండ్రి ఒక రా అధికారి. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాడు. గోపికి కూడా తన నాన్నల రా ఆఫీసర్ అవ్వాలనేది కోరిక. అందుకోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ ఎంపిక ప్రక్రియలో విఫలం అవుతుంటాడు. చివరికి ఇండియన్ గవర్నమెంట్ రహస్యంగా నిర్వహిస్తున్న ‘తినేత్ర’ అనే ఏజన్సీలో అధికారిగా జాయిన్ అవుతాడు. ఇక్కడ అతడికి ఓ మిషన్ అప్పగిస్తారు. ఆ మిషన్ లో వుండగా తన జీవితానికి సంబధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అవి ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి. గోపీకి ఇచ్చిన మిషన్ ఏమౌతుంది ? అనేది మిగితా కథ.
ఎలా ఉందంటే ?
దర్శకుడు శశి కిరణ్ ఒక కొత్త కధను చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో విజయం సాధించారు కూడా. కధను చాలా గ్రిప్పింగ్ గా నడిపారు. శశి కిరణ్ కి ఇదే మొదటి సినిమా అయినప్పటికీ మంచి అనుభవం వున్న దర్శకుడిగా ఈ సినిమాని తెరక్కించాడు. ఐతే, సెకాంఢాప్ కాస్త నెమ్మదించినట్టు అనిపించింది. క్లైమాక్స్ కి వచ్చేసరికి మళ్ళీ కధలో వేగం పెరిగింది. ‘క్షణం’ సినిమాతో నటుడిగానే కాక రచయితగా మెప్పించాడు అడివి శేష్. ఈ సారి హాలీవుడ్ బాండ్ సినిమాలను తలపించే ‘గూఢచారి’ కథతో ఆకట్టుకున్నాడు. ఐతే ఇలాంటి సినిమాలు డీల్ చేసినప్పుడు భారీ బడ్జెట్ అవసరం అవుతోంది. అడవి శేష్ మార్కెట్ ని పట్టించుకోకుండా ఈ సినిమాని తీయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలకు అభినందించాల్సిందే.
ఎవరేలా చేశారంటే ?
‘గూఢచారి’ కథ అడివి శేష్ కు ఫర్ ఫెక్ట్ గా సెట్టయ్యింది. ఆయనే కథ రెడీ చేశాడు కాబట్టి…ఆ పాత్రని పూర్తిస్థాయిలో ఓన్ చేసుకోగలిగాడు. ఎంతో ఈజ్ తో నటించారు. హీరోయిన్ గా చేసిన శోభిత తెలుగమ్మాయే . తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా. పాత్రకు తగ్గటు చేసింది. ఆమె నటన, గ్లామర్ తోనూ ఆకట్టుకొంది. దాదాపు 20యేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన సుప్రియ నటనతో ఆకట్టుకొంది. ప్రకాష్ రాజ్ ఎప్పటిలానే ఆకట్టుకున్నారు. మిగితానటీనటులు తమ తమ పరిథి మేరకు నటించారు.
సాంకేతికంగా :
ఇలాంటి కథలకు నేపథ్య సంగీతం ప్రధాన బలం. శ్రీచరణ్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. ‘గరుడ వేగ’ కంటే అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని గూఢచారికి ఇచ్చారు. సెకాంఢాఫ్ లో అక్కడక్కడ సినిమా నెమ్మదించిన… ప్రేక్షకుడు కథతో కనెక్ట్ కావడంతో.. పెద్ద మైనస్ గా అనిపించలేదు. అభిషేక్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్ : 3.5/5