లంచ్ బ్రేక్ : 2వ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ 86/6
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. లంచ్ సమాయానికి ఇంగ్లాండ్ 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. తొలుత అశ్విన్, తర్వాత ఇషాంత్ వరుసగా వికెట్లు తీసి ఆతిథ్య జట్టును తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశారు. రెండో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగుల వద్ద అశ్విన్ ఇంగ్లాండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్ (0) వికెట్ తీసిన తర్వాత ఆట ముగిసింది.
మూడో రోజు బౌలింగ్‌ను అశ్విన్ ఆరంభించాడు. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద ఓ అద్భుతమైన బంతికి జెన్నింగ్స్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపించాడు. 39 పరుగుల వద్ద జో రూట్‌ను అశ్విన్‌నే ఔట్ చేశాడు. అశ్విన్ తర్వాత వంతు ఇషాంత్ తీసుకున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేశాడు. చాలా సేపట్నుంచి క్రీజులో ఉన్న డేవిడ్ మలన్ (20; 64 బంతుల్లో 2×4)ను పెవిలియన్‌కు పంపించాడు. జానీ బెయిర్‌స్టో (28; 40 బంతుల్లో 5×4)ను, బెన్‌స్టోక్స్ (6; 13 బంతుల్లో)ను ఔట్ చేశాడు.