సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్లోకి బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్..!
బ్లాక్ బెర్రీ సరికొత్త ఫీచర్లతో కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇండియాలోనే తయారైన రెండు మోడ్రన్ స్మార్ట్‌ఫోన్లను ప్రీమియం బ్లాక్‌బెర్రీ గురువారం మార్కెట్‌లో విడుదలచేసింది. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఓఎస్, 5.99 అంగుళాల డిస్‌ప్లేతో ఈ రెండు ఫోన్లు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు భారత్‌లో బ్లాక్‌బెర్రీ మొబైల్స్‌ను ఉత్పత్తి చేస్తున్న ఆప్టిమస్ ఇన్‌ఫ్రాకామ్ తెలిపింది. ఎవాల్వ్ ఎక్స్ పేరిట విడుదలైన మొబైల్ ధర 34 వేల 990రూపాయలున్న ఈ ఫోన్ లో 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ స్పెషల్ ఫీచర్స్‌గా ఉన్నాయి. ఎవాల్వ్ ధర రూ.24,990గా నిర్ణయించింది.
ఎవాల్వ్ ఎక్స్ ఫీచర్లు స్మార్ట్ ఫోన్ ప్రియులను అబ్బురపరుస్తున్నాయి. 5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ ఉన్న ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 8.1 ఓరియో వెర్షన్, 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13+13 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4000ఎంఏహెచ్ బ్యాటరీతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది ఈ ఫోన్. ఈ నెలాఖరులో ఎవాల్వ్ ఎక్స్, ఎవాల్వ్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.