‘అన్న’ కాదు ‘విలన్’


‘ధృవ’ సినిమాతో రామ్ చరణ్ దృక్పథం మారింది. ఆయన విభిన్నమైన సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో చేసిన ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రామ్ చరణ్ సినిమా కూడా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న మాస్ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు.

ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నారు. ఇక, సీనియర్ హీరోలు ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లు చరణ్ కు అన్నగా కనిపిస్తారని ప్రచారం జరిగింది. ఐతే, ఆర్యన్ రాజేష్ చరణ్ అన్నకాదట.. విలన్ అని తెలిసింది. ఆయన స్టయిలీష్ విలన్ గా కనిపించబోతున్నారట. ఆ పాత్రని బోయపాటి అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పుకొంటున్నారు.

ఇప్పటికే బోయపాటి సీనియర్ హీరో జగపతి బాబు, యంగ్ హీరో ఆది పినిశెట్టిలని విలన్స్ గా మార్చారు. ప్రస్తుతం వీరిద్దరు స్టార్ విలన్స్ కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆర్యన్ రాజేష్ విలన్ గా మారుస్తున్నాడు బోయపాటి. చాన్నాళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇస్తున్న ఆర్యన్ రాజేష్ విలన్ గా బిజీ అయిపోతాడేమో చూడాలి. ఇక, ఈ చిత్రంలో చరణ్ సరసన కైరా అద్వానీ జతకట్టనుంది. డి వి వి దానయ్య నిర్మాత.