ఆయనకు టికెట్ ఇస్తే టీఆర్ఎస్ గెలవదట..!!
పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ మేయర్ కొంకటి లక్ష్మీ నారాయణకు స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యానారయణ మధ్య అంతర్గతంగా ఓరేంజ్ లో వార్ నడుస్తోంది. అవిశ్వాసం పెట్టడం దగ్గర నుంచి నెగ్గడం వరకు జిల్లాలో హైడ్రామా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ కలుగజేసుకున్నా ఎమ్మెల్యే వినకపోవడంతో స్తానికంగా టీఆర్ఎస్ లో గ్రూప్ వార్ తెర లేచింది. ఎమ్మెల్యే సోమారపు పై మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు.
దళితుడిననే నన్ను ఎమ్మెల్యే చిన్న చూపు చూసాడని, తనను అణగదొక్కాడని, దళితుడి సత్తా ఏమిటో చూపిస్తానంటూ సవాల్ విసిరారు మాజీ మేయర్ కొంకటి. ఎమ్మెల్యేకు రాకీయ సన్యాసం తప్పదని హెచ్చరించారు. ఆయన ఊరు విడిచి పెట్టి వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని, సోమారపుకు టికెట్ ఇస్తే పార్టీ గెలవదని అధిష్టానానికి చెబుతామని ఆయన చెప్పారు. తాను టిఆర్ఎస్ వదిలి వెళ్లే ప్రసక్తే లేదని, అవినీతికి పరాకాష్ట సోమారపు సత్యనారాయణ అని దుయ్యబట్టారు. ఆయన ఫ్యాక్టరీ పైపుల అమ్ముకునేందుకు మార్కండేయ కాలనీ డ్రైన్ పనిని మార్పించారని ఆరోపించారు.
తాను అవినీతిపరుడని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనంటూ సవాల్ విసిరారు. కెసిఆర్ ఇచ్చిన 200 కోట్లకు తాను అధిపతి అని ఎమ్మెల్యే భావిస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రామగుండం అభివృద్ధికి ఎన్ని కోట్ల నిధులు తెచ్చారో ఆయన చెప్పాలన్నారు. తన హయాంలో మంజూరైన పనులు జరగకుండా కావాలని అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.