రకుల్ ముఖ్యమంత్రి అవుతుందట


స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రతిదీ పక్కగా ప్లాన్ చేసుకొంటూ ఉంటుంది. ‘దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి’ అన్నట్టుగా డిమాండ్ లో ఉండగానే బాగానే వెనకేసుకొంటోంది. సినిమాలు చేస్తూనే బిజినెస్ చేస్తోంది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో జిమ్ లని నడుపుతోంది. మరోవైపు, వ్యాపార ప్రకటనలని వదలడం లేదు. ఇలా మూడు చేతుల్లా సంపాదిస్తోంది. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పదవినే టార్గెట్ పెట్టుకొంది రకుల్. తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోవాలని ఆశపడుతోంది.

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య ‘ఎన్ జీకే’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో సూర్య సరసన సాయిపల్లవి జతకట్టనుంది. ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం రకుల్ ని తీసుకొన్నారు. ఐతే, ‘ఎమ్ జీఆర్’ జీవితచరిత్రను ఆధారంగా తెరకెక్కుతోందనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయం ముందే చెబితే సినిమా షూటింగ్ కు అడ్డంకులు కలుగుతాయనే ఉద్దేశంతో సీక్రెట్ గా ఉంచారని సమాచారమ్. ఈ సినిమాలో రకుల్ పోషించేది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్ర అని చెప్పుకొంటున్నారు. ఇదే నిజమైతే.. రకుల్ ముఖ్యమంత్రి అయిపోయినట్టే.