కేటీఆర్ ని సప్రైజ్ చేసిన సుబ్బరాజు

టాలీవుడ్ నటుడు సుబ్బారాజు మంత్రి కేటీఆర్ ని సప్రైజ్ చేశాడు. ఈ విషయాన్ని తెలుపుతూ కేటీఆర్ ట్విట్ చేయడంతో.. అది హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ సుబ్బరాజు ఏం చేశాడో తెలుసా.. ? శుక్రవారం మంత్రి కేటీఆర్ ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి నటుడు సుబ్బరాజ్ కూడా వచ్చారు. ఐతే, ఈ సందర్భంగా సుబ్బరాజు కేటీఆర్ కు ముఖ్యమంత్రి సహాయ నిధికి కొంత మొత్తాన్ని చెక్ రూపంలో అందించారు.

ప్రయివేటు కార్యక్రమంలో.. సుబ్బరాజు చెక్ అందించడం కేటీఆర్ ని ఆశ్చర్యపరిచింది. సుబ్బరాజుని అభినందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సుబ్బరాజ్ ఎంతో మంచి మనసుతో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం చెక్ అందించారని కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక, సుబ్బరాజు విలన్, క్యారెక్టర్ రోల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో బిజీ నటుడిగా కొనసాగుతున్నారు. బాహుబలి లో ఆయన చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.