త్రివిక్రమ్ చేసిన పెద్ద తప్పు అది !


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చాలా తెలివైన దర్శకుడు. ఏ పంచ్ ఎక్కడ పడాలి. అదెంత లెన్త్ ఉండాలో కూడా తెలిసిన దర్శకుడు. అలాంటి త్రివిక్రమ్ ‘అజ్ఝాతవాసి’ సినిమా విషయంలో పెద్ద తప్పేశాడు. సినిమాలో పవన్ తండ్రి, సోదరుడి పాత్రలు హత్యకి గురవుతాయి. అప్పుడు పగ తీర్చుకోవడానికి బయల్దేరిన హీరో.. ఆ హంతకులను లేపేస్తాడని అంతా భావిస్తారు. కానీ, అలా జరగదు. పగ, ప్రతీకారం పక్కన పెట్టేసి హీరో బాగా ఎంటర్టైన్ చేస్తుంటాడు. అది ఆడియన్స్ కి నిరాశని కలిగించింది. ఆ ప్రభావం సినిమా ఫలితంపై పడింది. దీంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అజ్ఝాతవాసి అట్టర్ ప్లాపు గా మిగిలిపోయాడు.

త్రివిక్రమ్ ఈ పాయింట్ ని మారిస్తే బాగుండేది అన్నారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ‘పరుచూరి పాఠాలు’ కార్యక్రమంలో ఆయన ‘అజ్ఞాతవాసి’ సినిమాను గురించి ప్రస్తావించారు. ‘రక్త తిలకం’ సినిమా కోసం మేం చేసిన మార్పును త్రివిక్రమ్ కూడా చేసి వుంటే బాగుండునే అనిపించింది. అజ్ఝాతవాసి కోసం త్రివిక్రమ్ రాసుకొన్న ఆర్డర్ మాదిరిగానే మేం కూడా ‘రక్త తిలకం’ సినిమాకి రాసుకున్నాం. ఐతే, రామానాయుడు అదేంటయ్యా .. తల్లి మంచంలో పడి వుంటే హీరో ఎలా డ్యూయెట్లు పాడుకుంటాడు. నాకు నచ్చలేదు .. మార్చేయండి. అలాంటి మార్పు అజ్ఝాతవాసి విషయంలో త్రివిక్రమ్ చేసి ఉంటే బాగుండేది అన్నారు పరచూరి బ్రదర్.