ఏపీలో జీవీఎల్ కు అడ్ర‌సే లేదు…!!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన బీజేపీ నేత జీవీఎల్ న‌ర‌సింహారావుపై టీడీపీ నేత‌లు మండిప‌డ్డారు. ఏపీలో ల‌క్ష కోట్ల అవినీతి జ‌రిగింద‌ని చెబుతున్న జీవీఎల్ క‌నీసం వెయ్యి రూపాయ‌ల అవినీతినైనా నిరూపించాల‌ని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఏపీకి హోదాకోసం పోరాటం చేస్తుంటే పార్ల‌మెంట్ కు ముప్పు వ‌స్తుంద‌ని అంంటున్న జీవీఎల్, గ‌తంలో పార్ల‌మెంట్ ద‌గ్గ‌ర మోడీ క్యాండిల్ ర్యాలీ చేసిన‌ప్పుడు ముప్పు వ‌స్తుంద‌ని క‌నిపించ‌లేదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఆయ‌న నివాసంలో క‌లిసిన ఎంపీ కేశినేని నాని అనంత‌రం మీడియాతో మాట్లాడారు. జీవీఎల్ న‌ర‌సింహారావుకు ఏపీలో అస‌లు అడ్ర‌స్ లేద‌ని, ఆయ‌న అడ్ర‌స్ ఒక‌చోట , మాట్లాడేది ఇంకోచోట అని ఎద్దేవా చేశారు కేశినేని నాని. క‌నీసం జీవీఎల్ ఆధార్ కార్డు, పాస్ పోర్డు ఎక్క‌డ ఉందో ఆయ‌న‌కే తెలియ‌ద‌ని అన్నారు. జీవీఎల్ లాంటి వాడు ఏపీకి వ‌చ్చి ప‌చ్చి అబ‌ద్దాలు మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు.