మోసం చేశాడంటూ.. దర్శకుడిపై కేసు పెట్టిన నటి !


సుచిలీక్స్, శ్రీరెడ్డి లీక్స్, యుఎస్ సెక్స్ రాకెట్.. ఇలా టాలీవుడ్ ని షేక్ చేస్తూనే ఉన్నాయి. ఇవన్నీ చెప్పేది మాత్రం ఒక్కటే. ఇండస్ట్రీ పెద్ద రొంప. ఇందులో మహిళలకు మర్యాద లేదు. వారిని స్వార్థానికి, కామానికి వాడుకోవడమేనని. తాజాగా, ఇండస్ట్రీ నుంచి మరో షాకింగ్ న్యూస్ వినిపించింది. ఓ యంగ్ దర్శకుడు తనని మోసం చేశాడంటూ.. ఓ నటి పోలీస్ స్టేషన్ గడపతొక్కింది.

పి.లక్ష్మి అనే క్యారెక్టర్ ఆర్టిస్టుని పెళ్లి చేసుకుంటానని శ్రీదత్త యువ దర్శకుడు మోసం చేశాడట. వీరిద్దరు ప్రేమించుకొని.. సహజీవనం కూడా చేశారట. ఐతే, కొన్నిరోజులుగా కనిపించకుండా పోయిన శ్రీదత్త మరో అమ్మాయి పెళ్లి చేసుకొన్నాడు. ఈ విషయం తెలిసిన లక్ష్మీ ఆ దర్శకుడుపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తులో నిజనిజాలు తేల్చనున్నారు.