ఫస్ట్ పెగ్ కే.. నాగ్, నాని ఔట్ !

తెలుగు కాదు.. ఇండియన్ సినిమాలోనే ”దేవదాస్’ ఆల్ టైం క్లాసిక్. ట్రెండ్ సెట్టర్. ఆ టైటిల్‌ని మరోసారి గుర్తుచేస్తున్నారు నాగార్జున. నానితో కలసి ఆయన నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘దేవదాస్‌’. తాజాగా, ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. తప్పతాగి ఒళ్లు తెలియకుండా ఒకే బెడ్ మీద పడుకున్న నాగ్, నాని పోస్టర్ ని ఫస్ట్ లుక్ గా వదిలారు.

నాని తన ట్విట్టర్ ద్వారా ‘దేవదాస్’ ఫస్ట్ లుక్ ని అభిమానులతో పంచుకొన్నారు. దీనికి ఆసక్తికరమైన కామెంట్ పెట్టారు. “1996లో ‘నిన్నే పెళ్లాడతా’…. నాగ్ సర్ స్క్రీన్ మీద, నేను దేవి 70 ఎంఎం థియేటర్ బయట క్యూలైన్లో… 2018లో ‘దేవదాస్’… ఇద్దరం ఫస్ట్‌లుక్ పోస్టర్లో… బాగా మద్యం సేవించి ఒళ్లు తెలియకుండా… ఈ సినిమా అందరికీ నచ్చుతుంది” అని కామెంట్ పెట్టాడు నాని. నాని షేర్ చేసిన ఫస్ట్ లుక్ ఫోస్టర్, ఆయన పెట్టిన కామెంట్ రెండూ ఆకట్టుకొనేలా ఉన్నాయి.

ఈ సినిమాలో నాగ్ (దేవ) డాన్ పాత్రలో, నాని (దాస్) డాక్టర్ గా.. శాంతభాయ్ మెమోరియల్ చారిటీ హాస్పటల్‌లో పని చేసే డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ దేవ, దాస్‌కు సంబంధం ఏంటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్ లో పేర్కొన్నారు.